Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతుర్ని చూశాక ఉరికంబమెక్కిన యాకుబ్ మెమన్

Webdunia
గురువారం, 30 జులై 2015 (07:45 IST)
ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ తన కుమార్తెను చూశాకే ఉరి కంబమెక్కాడు. యాకుబ్ మెమన్ చివరి కోరికను నాగ్ పూర్ జైలు అధికారులు తీర్చారు. చివరి కోరిక మేరకు అతడికి కూతురిని చూపించిన జైలు అధికారులు, ఆ తర్వాత ఉరి కంబమెక్కించారు. శిక్ష అమలును నిలుపుదల చేయాలంటూ దాఖలైన యాకుబ్ పిటిషన్‌ను అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 
దీంతో యాకుబ్ ఉరిపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన జైలు అధికారులు వారిని జైలుకు పిలిపించారు. ఆ తర్వాత కూతురుతో పాటు కుటుంబ సభ్యులను కూడా యాకుబ్ కలుసుకున్నాడు. వారితో కొద్దిసేపు మాట్లాడాక అతనిని ఉరికంబమెక్కించారు. 
 
ఇకపోతే ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్‌కు గురువారం ఉదయం 6.30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. మహారాష్ట్ర నగరం నాగ్ పూర్‌లోని సెంట్రల్ జైల్లో అధికారులు అతడిని ఉరి తీశారు. ఐదుగురు అధికారుల సమక్షంలో యాకుబ్‌కు ఉరిశిక్ష అమలైంది. యాకుబ్‌కు ఉరిశిక్ష‌ను ఖరారు చేసిన టాడా కోర్టు న్యాయమూర్తి, నాగ్ పూర్ జైలు సూపరింటెండెంట్, మహారాష్ట్ర సీఎం కార్యాలయ అధికారి, డీఐజీ స్థాయి పోలీసు అధికారి, యాకుబ్ వైద్య చికిత్స చేసిన వైద్యుల సమక్షంలో ఉరి శిక్ష అమలైంది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments