Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారు తప్పు చేశారో లేదో తెలియదు.. నా డ్యూటీ చేశా : మన్మోహన్

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (09:13 IST)
తన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నవారు తప్పు చేశారో లేదో తనకు తెలియదని, కానీ, నేను మాత్రం నా డ్యూటీ చేసినట్టు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. తన కుమార్తె దమన్ సింగ్ రాసిన ‘‘స్ట్రిక్ట్ లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మన్మోహన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి నా విధులు నేను నిర్వర్తించాను. ఇతరులు ఏమి రాశారన్న దానిపై నేనేమీ స్పందించలేను’’ అంటూ రెండంటే రెండు ముక్కల్లో తన స్పందనను వెల్లడించేశారు.
 
నిజానికి ప్రధానిగా తాను తీసుకున్న నిర్ణయాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై ఆయన ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అయితే, ఆ ఆరోపణలను ఆయన ఖండించలేదు, అలాగని సమర్థించనూ లేదు. తన డ్యూటీ తాను చేశానని ముక్తాయించారు. అంతేకాక సదరు వ్యక్తులు తనపై చేసిన ఆరోపణల సారాంశం పూర్తిగా తనకు తెలియదని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
అలాగే, తండ్రిపై వచ్చిన ఆరోపణలపై కూడా దమన్ సింగ్ కూడా పెద్దగా స్పందించలేదు. ‘‘వాస్తవంగా ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. అందువల్ల దానిపై నేనేమీ మాట్లాడలేను. అసలు దానిపై నా వద్ద ఎలాంటి సమాచారం లేదు. వారేమి చెప్పారో నాకు తెలియదు. ఈ కారణంగా నేనేమీ చెప్పలేను. నిజంగా వారేమన్నారో నాకు తెలియదు. కాబట్టి, దానిపై నేను చెప్పేదేమీ లేదు’’ అంటూ వినోద్ రాయ్ వ్యాఖ్యలపై స్పందించాలన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments