Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కంటే పెద్ద గూండాను.. ఈ పార్టీ నాది.. నినాదాలతో భయపెట్టలేరు : అఖిలేష్‌కు ములాయం వార్నింగ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీ కంటే తాను పెద్ద గూండాను అని, నాలో దాగివున్న గుండాగిరిని లేపొద్దంటూ పరోక్షంగా

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (15:24 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీ కంటే తాను పెద్ద గూండాను అని, నాలో దాగివున్న గుండాగిరిని లేపొద్దంటూ పరోక్షంగా హెచ్చరిక చేశారు. అంతేనా.. పార్టీ నాదీ.. ఎంతో కష్టపడి స్థాపించాను. భజనపరులతో, నినాదాలతో పార్టీని నడిపించలేం అంటూ ఆయన హెచ్చరించారు. 
 
యూపీలోని అధికార ఎస్పీలో గత కొన్ని రోజులుగా అంతర్గత సంక్షోభం నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కొడుకు అఖిలేశ్‌ యాదవ్‌ను ఉద్దేశించి పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న యువత కన్నా తానే పెద్ద గూండానని తేల్చిచెప్పారు. కొడుకు అఖిలేశ్‌, బాబాయి శివ్‌పాల్‌ యాదవ్‌ మధ్య ఆధిపత్యం కోసం ఎస్పీలో తీవ్రస్థాయిలో రచ్చ చెలరేగింది. 
 
తాజాగా శివ్‌పాల్‌తోపాటు ఆయన సన్నిహిత మంత్రులపై సీఎం అఖిలేశ్‌ వేటు వేయగా.. అఖిలేశ్‌ సన్నిహితుడు రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి శివ్‌పాల్‌ యాదవ్‌ గెంటేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శివ్‌పాల్‌-అఖిలేశ్‌ మధ్య నిట్టనిలువుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ఎస్పీ అత్యవసర భేటీని ములాయం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఊహించినట్టుగానే అఖిలేశ్‌పై పరోక్ష వ్యాఖ్యలతో ములాయం విరుచుకుపడ్డారు. 
 
ఈ సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ... పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఎంతో క్లిష్టమైనదని నాకు తెలుసు. పార్టీలో ఇలాంటి విభేదాలు రావడం బాధ కలిగిస్తోందన్నారు. ఎంతో కష్టపడి మేం ఈ పార్టీని స్థాపించాం. మేం యువతకు ప్రాధాన్యం ఇచ్చాం. యువత పార్టీలో ఎక్కువసంఖ్యలో చేరేవిధంగా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశాం. కానీ ఈ పార్టీలో చేరిన యువ నాయకులు తమకుతాము గూండాలం అనుకుంటున్నారు. కానీ నేను వారి కన్నా ఇంకా పెద్ద గూండాను అని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments