Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ వల్లే జయలలిత మృతి చెందారు... మార్చి 8న దీక్షకు దిగుతున్నా... పన్నీర్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరో బాంబు పేల్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఆరోజు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు మేడ పైనుంచి కిందికి తోసేయడంతోనే తీవ్రంగా గాయపడ్డారనీ, అందువల్లనే ఆమె మృత్యువాత పడ్డారంటూ ఆరోపించారు. ప్రస్తుతం తను శశికళకు వ్యతిర

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (19:25 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరో బాంబు పేల్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఆరోజు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు మేడ పైనుంచి కిందికి తోసేయడంతోనే తీవ్రంగా గాయపడ్డారనీ, అందువల్లనే ఆమె మృత్యువాత పడ్డారంటూ ఆరోపించారు. ప్రస్తుతం తను శశికళకు వ్యతిరేకంగా వున్నానని తెలియడంతో కొంతమంది వైద్యులు వాస్తవాలను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు.

వారు చెప్పిన విలువైన సమాచారం తన వద్ద వున్నదన్నారు. అమ్మ ఆరోగ్యం విషమిస్తుందనీ, విదేశాల్లో వైద్యం చేయించాలని కోరితే అందుకు శశికళ అంగీకరించలేదని వారు తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ నిజాలు తెలిసిన తర్వాత ఇక అమ్మ మరణంపై నిగ్గు తేల్చాల్సిందేననీ, అందుకోసం మార్చి 8న తన వర్గంతో కలిసి నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు.
 
కాగా జయలలిత అనారోగ్యానికి గురైనప్పుడు ఓ డీఎస్‌పీ అంబులెన్సును రప్పించారని ఓపీఎస్ వర్గం చెబుతోంది. కాగా అసలా పని చేసిన డీఎస్పీ ఎవరు? ఆ అంబులెన్సు ఎక్కడ? అంబులెన్సు పోయెస్‌ గార్డెన్‌లో ఎన్ని గంటలకు బయలుదేరి, ఎన్ని గంటలకు అపోలోకు చేరుకుంది? అపోలో చుట్టూ ఉన్న 27 సీసీ కెమెరాలను హడావుడిగా ఎందుకు తొలగించారు? అని ఓపీఎస్ వర్గం పశ్నిస్తోంది. 
 
అలాగే, జయకు శాంతారాం అనే డాక్టర్‌ చికిత్స అందించేవారని, గత ఏడాది మే నెలలో ఆయన్ని పోయెస్‌ గార్డెన్ నుంచి బయటకు వెళ్లగొట్టారన్నారు. జయను అపోలోలో చేర్చేటప్పుడు ఎవరు సంతకం పెట్టారని ఓపీఎస్ టీం నిలదీసింది. జయలలిత మృతిచెందిన రాత్రి ముందుకువరకు ఆస్పత్రిలో జరిగిన డ్రామాపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. వీటన్నింటికీ సమాధానాలను రాబట్టాలంటే జయ మృతిపై న్యాయ విచారణ ఒక్కటే ఏకైక మార్గమన్నారు. 
 
అదేసమయంలో ఒకానొక సందర్భంలో జయలలితకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం సింగపూర్ లేదా లండన్‌లకు తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎయిర్ ఆంబులెన్స్‌ను సైతం సిద్ధం చేశారు. కానీ, చివరి నిమిషంలో వెనక్కితగ్గి.. చెన్నై అపోలో ఆస్పత్రిలోనే చికిత్స చేశారు. ఇలాంటి నిర్ణయం ఎవరిని అడిగి తీసుకున్నారంటూ పన్నీర్ వర్గం ప్రశ్నిస్తోంది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments