Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో విభేదాలు.. విడాకులు మంజూరు కావడంతో పాలతో స్నానం చేసిన భర్త!

ఠాగూర్
ఆదివారం, 13 జులై 2025 (14:46 IST)
భార్యతో విభేదాలు తలెత్తడంతో ఓ భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. సుధీర్ఘ విచారణ తర్వాత కోర్టు విడాకులు మంజూరుచేసింది. దీంతో ఆ వ్యక్తి పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. దీంతో ఏకంగా పాలతో స్నానం చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన భర్త పేరు మాణిక్ అలీ.. విడాకులను పాల స్నానంతో అలీ సెలెబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఎందుకింత సంబరం అని అడిగితే తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడని, మాణిక్ అలీ చెప్పాడు. తనతో వివాహమై ఓ బిడ్డ పుట్టినా ఆమె తన ప్రియుడుతో ఉన్న అక్రమ సంబంధం కొనసాగించిందని ఆరోపించారు. తనను తన బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందన్నాడు. ఒక్కసారిగా కాదు రెండుసార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు. మొదటిసారి తప్పు చేసినపుడు బిడ్డ కోసం తాను ఆమెను క్షమించానని చెప్పాడు.
 
మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని వివరించాడు. విడాకులు పొందాక కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉందని కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా 40 లీటర్ల పాలతో స్నానం చేశానని మాణిక్ అలీ చెప్పాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments