Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్ డ్రైవర్ ఎంత పని చేశాడు.. నవ దంపతులను పొట్టనబెట్టుకున్నాడు..

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (12:32 IST)
ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ సెల్‌ఫోన్ వాడుతూ.. డ్రైవింగ్ చేసిన కారణంగా.. నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. సెల్‌ఫోన్ వాడుతూ బండిని నడిపిన కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు ఏపీ 29 జడ్ 2157 నెంబర్ గల తెలంగాణ ఆర్టీసీ బస్సు వెళ్తోంది.
 
ఇటీవలే ప్రేమించి వివాహం చేసుకున్న రాజమండ్రికి చెందిన కోటేశ్వర రావు (29), స్వప్న (27) దంపతులు తమ వాహనంపై అదే రూట్లో వస్తున్నారు. కానీ సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ.. బస్సును నడిపిన డ్రైవర్ టీవీ రెడ్డి, బస్సును అదుపు చేయలేక, డివైడర్‌ పైకి ఎక్కించాడు. అది పక్కనే వెళ్తున్న కోటేశ్వరరావు దంపతుల పైకి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. లొంగిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments