Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్‌నగర్లో కొత్త కరెన్సీ ముఠా: రూ.50లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం.. ఓ బడా వ్యక్తి కోసం?

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ఓ పార్కులో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ చేతులు మారుతుందని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్న ముఠాను పో

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (16:17 IST)
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ఓ పార్కులో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ చేతులు మారుతుందని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 50 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 
 
నగరానికి చెందిన ఓ బడా వ్యక్తి కోసం ఖమ్మం జిల్లా నుంచి రూ. 50 లక్షల కొత్త కరెన్సీ తీసుకొచ్చిన ముఠా సభ్యులు పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకొని బ్లాక్ మనీకి బదులు వైట్ మనీ ఇస్తుండగా, పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేశారు.
 
ఇదేవిధంగా పాతనోట్లకు కొత్త నోట్లను మార్పిడి చేసే ముఠాను శుక్రవారం విజయవాడ బస్టాండ్‌ ఆవరణలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.31 లక్షల కొత్త కరెన్సీ(రూ.2000 నోట్లు), రూ.50 వేలు పాత కరెన్సీ (రూ.500 నోట్లు), 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గుంటూరు జిల్లాలోని తుళ్లూరుకు చెందిన జి.వంశీకృష్ణ, పొన్నూరుకు చెందిన ఎం.నాగవెంకట సునీల్‌గా గుర్తించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments