Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ పరిచయం.. వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి హత్య.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 జులై 2021 (09:49 IST)
ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనికి ఆర్థికంగా సాయం కూడా చేసింది. అయితే ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో.. ప్రియుడితో కలిసి ఆమె దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మండ్య నగరంలోని గుత్తలు లేఔట్‌లో అల్తాఫ్ మెహది నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య సైదా రిజ్వాన్, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అల్తాఫ్.. పీయూ కాలేజ్‌లో ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల కిందట అల్తాఫ్ భార్య రిజ్వాన్‌కు ఫేస్‌బుక్‌లో దావణగెరెకు చెందిన రహంతుల్లా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
ఈ క్రమంలోనే రిజ్వాన్.. ప్రియుడికి ఆర్థిక సాయం చేసింది. అతనితో ఓ షాప్ పెట్టుకోవడానికి సాయం చేసింది. అయితే భార్య వివాహేతర గురించి తెలుసుకున్న అల్తాఫ్ షాక్ తిన్నాడు. పద్దతి మార్చుకోవాలంటూ భార్యను మందలించాడు. అయితే భర్త మాటలు పట్టించుకుని రిజ్వాన్.. అతడిని హత్య చేయాలని భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. శుక్రవారం రాత్రి ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.
 
అందరూ పడుకున్న సమయంలో.. ప్రియుడితో కలిసి అల్తాఫ్‌ను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ప్రియుడికి అక్కడి నుంచి పంపించివేసింది. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్టుగా నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. అయితే అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రిజ్వాన్‌తో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments