Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్టినిల్లు దూరంగా ఉందనీ వెళ్లేందుకు నిరాకరించిన వధువు..

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (14:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వివాహం జరిగిన ఏడు గంటల్లోనే నవ వధువు తన నిర్ణయం మార్చుకుంది. వివాహమైన తర్వాత అత్తారిల్లు దూరంగా ఉందని అక్కడకు వెళ్లేందుకు నిరాకరించింది. అప్పగింతలు పూర్తయిన తర్వాత ఏడు గంటల్లోనే వధువు తన మనసు మార్చుకుంది.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన యువతికి.. రాజస్థాన్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అనంతరం ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. అప్పగింతలు అయిపోయాక వధూవరులిద్దరూ కలిసి అత్తారింటికి బయలుదేరారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ వధువు ఒక్కసారిగా మనసు మార్చుకుంది.
 
'అత్తవారిల్లు చాలా దూరం.. నాకు రాజస్థాన్‌ వెళ్లాలని లేదు.. నేను వారణాసి వెళ్లిపోతా' అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కారు ఆపాలంటూ గట్టిగా అరిచింది. దీంతో రోడ్డు పక్కన పెళ్లి వాహనాలు ఆగిపోయాయి. ఆదేసమయంలో ఆ ప్రాంతంలో వధువు ఏడుస్తూ ఉండటాన్ని చూసిన పోలీస్‌ రెస్పాన్స్‌ వాహనంలోని సిబ్బంది.. మహరాజ్‌పుర్‌ పోలీసులకు సమాచారం అందించారు.
 
అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. వారిని వివరాలు అడిగారు. తాము అమ్మాయికి పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసి వెళ్తానని వధువు పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెను మహిళా పోలీసు సహాయంతో అక్కడకు పంపించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments