Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్య చేసి ఉరేసిన బీజేపీ నేత - సెక్స్ రాకెట్ బయటపడుతుందనీ...

Webdunia
సోమవారం, 2 మే 2022 (09:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచనంగా మారిన బీజేపీ నేత శ్వేతా సింగ్‌ మృతి కేసులో స్పష్టత వచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, కట్టుకున్న భర్తే హత్య చేసి ఉరికి వేలాడిదీసినట్టు తేలింది. తనకు, అంతర్జాతీయ సెక్స్ ముఠాకు ఉన్న సంబంధాలు భార్యకు తెలిశాయి. ఈ విషయాలను ఆమె బహిర్గతం చేస్తుందని భావించిన భర్త దీపక్ సింగ్ ఆమెను హత్య చేసి చంపేశాడు. 
 
మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు శ్వేతాసింగ్ భర్త దీపక్ సింగ్ రష్యన్, మొరాకో, ఆఫ్రికన్ అమ్మాయిల కోసం బ్రోకర్లతో సంప్రదింపులు జరిపారు. శ్వేత తన మరణానికి ముందు తన భర్త ఫోన్ కాల్స్ రికార్డింగుల గురించి తన కుటుంబ సభ్యులకు తెలిపారు. రష్యాలోని సెక్స్ వర్కర్లతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని దాచిపెట్టేందుకు దీపక్ ఆమెను హత్య చేసి ఉంటాడని ఆమె సోదరుడు రితురాజ్ ఆరోపించారు. 
 
ఓ ఆడియోలో దీపక్ ఓ రష్యన్ అమ్మాయిని అడగ్గా బ్రోకర్ మాత్రం తన వద్ద మొరాకో అమ్మాయి మాత్రమే ఉందని చెప్పాడు. అప్పుడు దీపక్.. తాము నలుగురం ఉన్నామని, కాబట్టి ఒక ఇండియన్ అమ్మాయి కూడా కావాలని కోరారు. ఈ సంభాషణ చాలాసేపు నడిచింది. 
 
అనంతరం దీపక్.. తాను లక్నోలోని నాకా హిందోళ ప్రాంతంలో ఉన్న ఎంజే ఇంటర్నేషనల్ హోటల్‌లో ఉన్నట్టు చెప్పారు. అక్కడికే ఇద్దరు అమ్మాయిలను పంపాలని కోరారు. కాగా, దీపక్ సింగ్‌ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంధించి పలు వీడియోలు కూడా అందుకున్నట్టు ఎస్పీ అభినందన్ చెప్పారు. అన్నింటిపైనా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం