Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chips: అమ్మా, నేను దొంగతనం చేయలేదు.. చిప్స్ ప్యాకెట్ కోసం అంత అవమానమా?

సెల్వి
శుక్రవారం, 30 మే 2025 (12:21 IST)
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పన్స్కురాలోని గోసైన్‌బర్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడు స్థానిక కిరాణా దుకాణం నుండి చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడనే ఆరోపణలతో బహిరంగంగా అవమానానికి గురైయ్యాడనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
వివరాల్లోకి వెళితే... మృతుడిని దుకాణదారుడు నిలదీసి దొంగతనం చేశాడని ఆరోపించాడు. ఇతర కస్టమర్ల ముందు అతన్ని బిగ్గరగా తిట్టారని, అవమానించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘర్షణ సమయంలో బాలుడిని కూడా చిత్రీకరించారని కొంతమంది స్థానికులు ఆరోపించారు. 
 
కన్నీళ్లతో వణికిపోయిన ఆ పిల్లవాడు ఇంటికి పరిగెత్తి, ఆ ప్యాకెట్ దొంగిలించలేదని, తర్వాత డబ్బులు ఇవ్వాలని అనుకున్నానని తన తల్లికి చెప్పాడని తెలుస్తోంది. ఆ బాలుడు 'అమ్మా, నేను దొంగతనం చేయలేదు, డబ్బులు ఇస్తాను' అని చెబుతూనే ఉన్నాడు. అతను ఆ సమయంలో ఏడుస్తూనే ఉన్నాడు," అని అతని తల్లి తన దుఃఖాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ చెప్పింది. 
 
గంటల తర్వాత, ఆ బాలుడు తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు అతన్ని చనిపోయినట్లు ప్రకటించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యగా తేలింది.

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అధికారులు దుకాణదారుడిని, సంఘటన స్థలంలో ఉన్న ఇతరులను ప్రశ్నిస్తున్నారు. బాలల హక్కుల సంఘాలు-మానసిక ఆరోగ్య నిపుణులు మైనర్లను బహిరంగంగా అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ వివరణాత్మక నివేదికను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments