Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చం 'చెలియా' సినిమా తరహాలోనే... అభినందన్ చిక్కాడు...

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (09:24 IST)
సాధారణంగా నిజ జీవితంలో జరిగే సంఘటనలు, మహనీయుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు నిర్మిస్తుంటారు. వెండితెరపై చూపించే సన్నివేశాలన్నీ కల్పితమే. కానీ, అదే వెండితెరపై చూపించిన సన్నివేశాల తరహాలోనే భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ఇపుడు శత్రుసైన్యానికి చిక్కాడు. 
 
గతంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం చెలియా (తమిళ మాతృక మూవీ కాట్రు వేళయిదై). ఈ చిత్రంలో కార్తీ హీరోగా నటించగా, ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చాడు. చెలియా పేరుతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షధారణ పొందింది. 
 
ఈ చిత్ర కథ కార్గిల్ యుద్ధంలో భార‌త వైమానిక ద‌ళానికి చెందిన విమానాన్ని పాక్ ఆర్మీ కూల్చి వేసే స‌న్నివేశంతో చిత్రం ప్రారంభమవుతుంది. అయితే చిత్రంలో హీరోగా న‌టిస్తున్న కార్తీ.. అభినంద‌న్‌లానే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకొని పాక్ ఆర్మీకి దొరికిపోతాడు. వెంట‌నే అత‌న‌ని యుద్ధ‌ఖైదీగా ప‌ట్టుకుంటుంది. దీనికి అందమైన ప్రేమ కథను దర్శకుడు జోడించాడు. 
 
పైగా, ఈ కథకు సంబంధించి భార‌త్ వైమానిక ద‌ళం ప‌నితీరు మొత్తాన్ని మ‌ణిర‌త్నానికి వివ‌రించింది ప్రస్తుత శత్రుసైన్యం వద్ద బందీగా ఉన్న అభినంద‌న్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ కావడం గమనార్హం. ఈ సినిమా క‌థ మ‌ణిర‌త్నం వివ‌రించిన‌ప్పుడు త‌న వంతు సాయం అందించినట్టు సింహకుట్టి గతంలో చెప్పుకొచ్చాడు. అలా సింహ‌కుట్టి సాయంతో రూపొందిన చెలియా చిత్రంలోని ఓ స‌న్నివేశం మాదిరిగా ఇప్పుడు సింహకుట్టి తనయుడు శ‌తృ సైన్యానికి చిక్క‌డం విధి వైచిత్ర‌మే.
 
గతంలో కూడా వెండితెరపై చూపిన పలు అంశాలు కొందరు హీరోల యధార్థ జీవితంలోనూ చోటుచేసుకున్నాయి. ఇటీవ‌ల ఎన్టీఆర్ న‌టించిన "అర‌వింద స‌మేత" చిత్రంలో తండ్రి పాత్ర పోషించిన నాగబాబు కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో మ‌ర‌ణించ‌గా, అదేవిధంగా ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ నిజ జీవితంలోనూ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. విధి వైప‌రిత్యం ఎంత దారుణంగా ఉంటుందోనంటూ తన తండ్రి మృత్యువును తలచుకుని హీరో పలుమార్లు ఎంతగానో బాధపడ్డారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments