Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు నిమిషాల్లోనే పోలింగ్​ శాతం సగం ఎలా తగ్గింది?: ఈసీకి తృణమూల్​ ఫిర్యాదు

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (16:48 IST)
బెంగాల్ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై ఆ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు నిమిషాల్లోనే పోలింగ్ శాతం సగానికి సగం ఎలా తగ్గిందని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ లేఖ రాశారు. ఈరోజు బెంగాల్ లో తొలి దశ ఓటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతంపై తృణమూల్ అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఏం జరుగుతోంది? 5 నిమిషాల్లోనే పోలింగ్ శాతం సగానికి సగం ఎలా తగ్గిందో ఎన్నికల సంఘం చెప్పాలి. షాకింగ్ విషయమిది. బెంగాల్ ఎన్నికల ముఖ్య అధికారి దీనిపై వెంటనే స్పందించాలి’’  అని తృణమూల్ పార్టీ ట్వీట్ చేసింది.
 
తృణమూల్ కు ఓటు పడడం లేదని ఓటర్లు చెబుతున్నారంటూ మరో ట్వీట్ లో పేర్కొంది. కాంతి దక్షిణ అసెంబ్లీ సీట్ లో చాలా మంది ఓటర్ల నుంచి ఇవే ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించింది. తృణమూల్ కు ఓటేస్తే వీవీప్యాట్ లలో బీజేపీకి ఓటు పడినట్టు చూపిస్తున్నాయని ఓటర్లు చెప్పారని పేర్కొంది. ఇది క్షమించరానిదని మండిపడింది.
 
కాగా, పోలింగ్ బూత్ లలోకి బయటి ఏజెంట్లను అనుమతించడంపై బెంగాల్ సీఈవోకు అభ్యంతరాలు తెలియజేశామని తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. ఇంతకుముందు స్థానిక బూత్ లలో ఓటు హక్కు ఉన్నవారినే అక్కడ ఏజెంట్లుగా నియమించేలా నిబంధన ఉండేదని, కానీ, ఆ నిబంధనలను బీజేపీ మార్చేసిందని అన్నారు. ఆ నిబంధనను మార్చాల్సిందిగా సీఈవోను కోరామన్నారు. కాగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 36 శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments