Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరుక్కపోయి... ఇరుక్కుపోయిన చిరుత..! బిందెలో తల పెట్టి...

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (07:59 IST)
పాపం చిరుత... దాహం వేసింది. గ్రామంలోకి అడుగు పెట్టింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది. ఇక చూస్కో అక్కడ నుంచి చిరుత పులి పిల్లిలా తయారైంది. తన ఎదురుగా ఏముందో కూడా తెలియక ఎక్కడికక్కడ అణుగుతూ ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన రాజస్థాన్‌ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. 
 
రాష్ట్రంలోని రాజ్‌సమంద్‌ జిల్లా సర్దుల్‌ ఖేడా గ్రామంలోకి బుధవారం ఉదయం ఓ చిరుతపులి చొరబడింది. అక్కడా ఇక్కడా తిరిగి తిరిగి అలసిపోయి నీళ్ళు తాగుదామని బిందెలో మూతిపెట్టి నీళ్లయితే తాగేసింది. ఇక తల తీద్దామంటే ఇరుక్కుపోయింది. దానిని తీసుకోవడానికి నానా తంటాలు పడింది. అటు పరుగెత్తింది. ఇటు పరిగెత్తింది. వీలు కాలేదు. 
 
చివరకు ఓ మట్టిరోడ్డులో కూర్చుని బిత్తర బిత్తరగా అణిగణిగి ఉండిపోయింది. కళ్ళు కనిపించే అవకాశం లేకపోవడంతో ఎటు వెళ్ళాలో తెలియక అలాగే కూర్చుండిపోయింది. చిరుత ఇబ్బందులు చూసిన గ్రామస్తులు అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి ఎట్టకేలకు బిందెను తొలగించారు. పులిని బోనులో బంధించి తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. బతుకు జీవుడా అంటూ చిరుత అడవిలోకి తుర్రుమంది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments