Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌ ఆస్పత్రుల్లో చిన్నారుల మరణ మృదంగం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. మొన్న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో అనేక మంది చిన్నారుల మృత్యువాతపడ్డారు. సోమవారం ఫరూఖాబాద్‌ దావఖానా

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:14 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. మొన్న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో అనేక మంది చిన్నారుల మృత్యువాతపడ్డారు. సోమవారం ఫరూఖాబాద్‌ దావఖానాలో పదుల సంఖ్యలో చిన్నారులు చనిపోయారు. ఈ రాష్ట్రంలోని మిగిలిన ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
గోర‌ఖ్‌పూర్ బీఆర్డీ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌కముందే మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఫ‌రూఖాబాద్‌లోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా రాజ్‌కియా చికిత్సాల‌యంలో నెల రోజుల వ్య‌వ‌ధిలో 49 మంది చిన్నారులు మృతి చెందారు. ఆక్సీజ‌న్, మందుల కొర‌త వ‌ల్ల‌నే చిన్నారులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. 
 
ఘ‌ట‌న‌లో సీఎంవో, సీఎంఎస్ ఉన్న‌తాధికారులు స‌హా వైద్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. చిన్నారుల మృతిపై వెంట‌నే పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కాగా, యూపీ ఆస్పత్రుల్లో చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నా ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments