Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణ మెజార్టీ వచ్చిందిగా.. ఇక రామమందిర నిర్మాణం మొదలెట్టండి : శివసేన

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్యలో రామాలయం నిర్మించాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు భారతీయ జనతా పా

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (09:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్యలో రామాలయం నిర్మించాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీని కోరింది. 
 
శనివారం వెల్లడైన యూపీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు భిన్నంగా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా బీజేపీ ఏకంగా 325 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో శివ‌సేన పార్టీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ, బీజేపీకి అభినంద‌న‌లు తెలుపుతూ, రామ మందిరం అంశాన్ని మ‌రోసారి తెర‌పైకి తెచ్చింది. 
 
ఇదే అంశంపై శివ‌సేన‌ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్ మాట్లాడుతూ.. ఇక‌ త్వరలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తారని తాము ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశారు. ఇంతకుమించిన మంచి తరుణం మరొకటి లేదన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని ఆయన గట్టిగా కోరారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments