Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. చెల్లెలు ప్రేమించిందని గొంతు గోసిన అన్నయ్య

Webdunia
శనివారం, 22 జులై 2023 (11:56 IST)
యూపీలో దారుణం చోటుచేసుకుంది. చెల్లెలు ప్రేమించిందని ఓ అన్నయ్య ఆమెను పరువు కోసం హత్య చేశాడు. చెల్లి ప్రేమ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు ఆమె తలనరికి చంపేశాడు. ఆమె తల తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బారాబంకీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మిత్వారా గ్రామానికి చెందిన ఆషిఫా (18), అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అతని కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలిక ఆచూకీ కనుక్కుని ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.
 
ఇటీవల ఈ విషయమై ఆషిఫాకు ఆమె అన్న రియాజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి గురైన రియాజ్ చెల్లెలి గొంతు కోసం హత్య చేశాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోదామనుకుని బయల్దేరారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments