Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి ప్రాణం పోతుంటే ప్రతిక్షణం వీడియో - సెల్ఫీలు తీస్తూ ఎంజాయ్...

ఒకవైపు యువతి ప్రాణం పోతుంటే.. మరికొందరు ఆ యువతి ప్రాణంపోయేతీరును సెల్ఫీలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. దళిత యువకుడిని ప్రేమించినందుకు ఓ యువతిని సొంత తమ్ముడే గొంతుకోశ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (16:29 IST)
ఒకవైపు యువతి ప్రాణం పోతుంటే.. మరికొందరు ఆ యువతి ప్రాణంపోయేతీరును సెల్ఫీలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. దళిత యువకుడిని ప్రేమించినందుకు ఓ యువతిని సొంత తమ్ముడే గొంతుకోశాడు. అంతటితో చల్లారని కిరాతకుడి ఆగ్రహానికి దళిత యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం పదిరోజుల క్రితం నిగ్వా గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సరిగ్గా 10 రోజుల క్రితం నిర్మల్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో జంట హత్యలు కలకలంరేపిన విషయం తెల్సిందే. మహారాష్ట్ర భోకర్‌ తాలుకా కేర్బాన్‌ గ్రామానికి చెందిన పూజ(21), గోవింద్‌(26) అనే యువతీయువకుడు ప్రేమించుకున్నారు. వీరిలో పూజ వడ్డెర కులానికి చెందిన యువతి.. గోవింద్ దళితుడు. ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 
 
వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు కదా బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి చేశారు. కానీ వారి ప్రేమ మాత్రం చావలేదు. పూజకు పెళ్లైన నెల తర్వాత ఇద్దరు కలిసి బతికేందుకు ఇంటి నుంచి పారిపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆమె తల్లిదండ్రులు వారి కోసం గాలించారు. 
 
ఇంతలో పూజ తమ్ముడు దిగంబర్ ఆమె సెల్‌ఫోన్‌కు కాల్ చేశాడు. ఇద్దరూ తిరిగి వస్తే పెళ్లి చేస్తామని నమ్మపలికాడు. సోదరుని మాటలు నమ్మిన పూజ తాము నిగ్వా వైపు వెళుతున్నామంటూ సమాచారం చేరవేసింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న దిగంబర్... పూజ, గోవింద్‌లపై కత్తితో దాడి చేస్తూ విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో గోవింద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆ తర్వాత పూజను పట్టుకుని గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడ్డ పూజ రోడ్డుపై పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన దిగంబర్ అక్కడి నుంచి పారిపోయాడు. అలా రోడ్డుపై పడిన పూజ 2 గంటలపాటు ప్రాణాలను కాపాడుకునేందుకు తల్లడిల్లిపోయింది. దీన్ని చూసిన వాహనదారులు.. ఇరుగుపొరుగువారు.. ఆమె వీడియోలు, సెల్ఫీలు తీస్తూ ఉండిపోయారే గానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ యువతిని రక్షించేందుకు ప్రయత్నించలేదు. 
 
కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయలేదు. పైగా, ఆ యువతి ప్రాణాలు వదులుతున్న తీరును ప్రతిక్షణం వీడియో తీసి ఆనందించారు. ఇలా వీడియో తీసిన వ్యక్తుల్లో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ జంటల హత్యల చిక్కుముడి వీగిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దిగంబర్ కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments