Webdunia - Bharat's app for daily news and videos

Install App

చకచక సాగిపోతున్న పాకిస్థాన్ జాతీయుల వీసాల రద్దు...

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (15:15 IST)
కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, పాక్ జాతీయుల వీసాలను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి తక్షణం వెనక్కి పంపాలని కేంద్ర హోం శాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అపుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. 
 
గతంలో భారత్ సార్క్ వీసా పొడగింపు పథకం కింద అనేక మంది పాక్ పౌరులకు భారత్‌లో పర్యటించే అవకాశాలను కల్పించింది. ఈ పథకం కింద భారత్‍‌లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వైద్య వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 
 
ఇక పాక్ నుంచి కొత్త దరఖాస్తులుకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో పాటు పాక్‌లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. అదేసమయంలో ఇక్కడ ఉన్న పాక్ జాతీయులు గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments