Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు : 18కి చేరిన మృతులు!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (15:50 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ బస్సు 400 అడుగుల లోతులో ఉండే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొలుత 15 మంది మరణించారని భావించగా, ప్రస్తుతం ఈ సంఖ్య 18కు చేరింది. ఈ ప్రమాదం ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాకు 250 కిలోమీటర్ల దూరంలో రోహతుంగ్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. 
 
ప్రమాద స్థలంలో 15 మంది మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు కిన్నౌర్ డిప్యూటీ కమిషన్ డిడి శర్మ వెల్లడించారు. 
 
సాంగ్లా నుంచి కల్పాకు బయలుదేరిన బస్సు మధ్యలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. గాయపడినవారిని బయటకు తీసి అస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి వారి బంధువులకు అప్పగించనున్నట్లు శర్మ చెప్పారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమం ఉంది. 

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments