Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HimachalPradeshElections : ఓటు వేసిన శతాధిక వృద్ధుడు.. 74 శాతం పోలింగ్

పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 74 శాతం ఓటింగ్‌ నమోదైంది. 68 నియోజకవర్గా

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (08:52 IST)
పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 74 శాతం ఓటింగ్‌ నమోదైంది. 68 నియోజకవర్గాల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 
 
సిమ్లా పట్టణంలో 66 శాతం పోలింగ్‌ నమోదైంది. సీఎం వీరభద్రసింగ్‌, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌, కేంద్రమంత్రి జేపీ నడ్డాతోపాటు పలువురు ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న చేపట్టనున్నారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో శతాధిక వృద్ధుడు శ్యామ్ సరన్ నేగి (101) తన ఓటు హక్కును కల్పా పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. 1917 జూలై ఒకటో తేదీన జన్మించిన ఈయన.. స్వతంత్ర భారతావనిలో 1951లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తొలి ఓటరు కావడం కావడం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments