హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. మత స్వేచ్ఛ సవరణ బిల్లు 2022ను ప్రవేశపెట్టి అమల్లో ఉన్న చట్టానికి కఠిన సవరణలు చేసింది. ఈ సవరణ మేరకు.. బలవంతపు మతమార్పిడులకు పాల్పడితే పదేళ్ళ పాటు జైలుశిక్ష విధిస్తారు.
ఈ బిల్లులోని కీలక అంశాలను పరిశీలిస్తే, ఈ బిల్లులో సామూహిక మార్పిడిని నిషేధించారు. బలవంతంగా మత మార్పిడులు చేయరాదు. అలా బలవంతపు మాత మార్పిడులకు పాల్పడితే మాత్రం పదేళ్ల జైలుశిక్ష విధిస్తారు.
18 నెలల క్రితం అమల్లోకి వచ్చిన హిమాచల్ ప్రదేశ్, మత స్వేచ్ఛ చట్టం 2019కి మరింత కఠినమైన సంస్కరణ అని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.