సారీ సార్.. ఇప్పుడే ఫ్రెండ్‌ని కత్తితో పొడిచి పారిపోయి వస్తున్నా.. హెల్మెట్ వేసుకోలేదు..

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (16:09 IST)
హెల్మెట్ లేదని ఆపితే.. ట్రాఫిక్ పోలీసుకు దిమ్మదిరిగిపోయింది. హెల్మెట్ అడిగినందుకు చేతిలో వున్న రక్తంతో కూడిన కత్తిని చూపెట్టాడు. అంతే షాక్ తిన్న ట్రాఫిక్ పోలీస్ అతనిని అదుపులోకి తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. చిక్కబల్లాపుర ప్రాంతానికి చెందిన సందీప్ షెట్టి (26) రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని స్నేహితుడు దేవరాజ్‌ కూడా వంట నూనె దుకాణం నడుపుతున్నాడు. అయితే లక్ష రూపాయలను సందీప్ నుంచి దేవరాజ్ తీసుకున్నాడు. 
 
రియల్ ఎస్టేట్ వ్యాపారం పెడతానని.. సొంత ఖర్చులు పెట్టున్నాడు. ఇంకా లక్ష రూపాయలను తిరిగి ఇవ్వాలని సందీప్ కోరినా.. ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సందీప్ స్నేహితుడిని కత్తితో పొడిచి... అక్కడి నుంచి దేవరాజ్ బైకుపైనే సందీప్ పారిపోతుండగా, హెల్మెట్ లేదని ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. దీంతో జడుసుకున్న సందీప్ పోలీసులకు చెప్పేశాడు. 
 
దీంతో పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. సందీప్‌ చేతిలో కత్తితో దాడికి గురైన దేవరాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments