Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులం.. కులం.. కులం.. చచ్చిన తర్వాత కులాన్ని వెంట తీసుకెళ్తారా?

ఆధునికత పెరిగినా.. పరువు హత్యలు జరుగుతూనే వున్నాయి. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తరగనూ లేదు. తాజాగా ఓ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో అందరినీ కంట తడ

Webdunia
బుధవారం, 4 జులై 2018 (15:43 IST)
ఆధునికత పెరిగినా.. పరువు హత్యలు జరుగుతూనే వున్నాయి. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తరగనూ లేదు. తాజాగా ఓ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో అందరినీ కంట తడిపెట్టిస్తుంది. కులం పేరుతో తమ ప్రేమకు అడ్డుగోడలు కట్టడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు కులాన్ని నిలదీసుకుని మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
కులపిచ్చి వున్న వారిని వీడియోలో ఏకిపారేశాడు. ఈ కులం రోగం ఏమిటని ప్రశ్నించాడు. కులం.. కులం  అంటూ ఎందుకీ పాకులాట. కొంచెం మనుషుల్లా వ్యవహరించండి. చచ్చిన తర్వాత కులాన్ని వెంట తీసుకెళ్తారా? అంటూ తమ ప్రేమ పెళ్లికి అడ్డు చెప్పిన ప్రేమికురాలి తండ్రిని కడిగిపారేశాడు. ఇక ఎప్పటికీ మీ జోలికీ, మీ కుమార్తె జోలికి రానంటే రాను. అయితే ఆమె ఎప్పటికీ బాగుండాలని కోరుకుంటున్నా.. అంటూ ఎఫ్‌బీలో వీడియో పెట్టి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన బెంగళూరులోని క్యాతసంద్రలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన రాఘవేంద్ర (26) అదే ప్రాంతానికి చెందిన యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల ప్రియురాలి ఇంటికి వెళ్లిన రాఘవేంద్ర ఆమె తండ్రిని కలిసి మాట్లాడాడు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లికి అంగీకరించాలని కోరాడు. దీనికి ఆయన నిరాకరించాడు. కులాలు వేరని, పెళ్లి కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో ఇక తాము కలిసి జీవించడం అసాధ్యమని భావించిన రాఘవేంద్ర తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments