Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద పుష్కర్ మృతి కేసు: కొత్త ప్యానెల్ ఎంపిక.. క్షుణ్ణంగా దర్యాప్తు!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (16:00 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ప్యానల్‌‌ను నియమించింది. చండీగఢ్‌కు చెందిన ఇద్దరు వైద్యులు, పుదుచ్చేరి వైద్యులొకరు, ఢిల్లీలో లేడి హర్డింజ్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఒకరు ఉన్నట్లు తెలిసింది.
 
ఈ కేసులో ఫోరెన్సిక్ సాక్ష్యాలను విశ్లేషించేందుకు కొత్తగా ఈ నలుగురితో కూడిన ప్యానెల్ పనిచేస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్‌కు ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ ప్యానెల్ నియామకం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ నుంచి వచ్చిన వైద్య నివేదికను కూడా పూర్తిగా పరిశీలిస్తారు. దర్యాప్తు సజావుగా జరిగేందుకు పోలీసులకు సహకరిస్తారు. 
 
ముఖ్యంగా ఏఐఐఎంఎస్ వైద్యులు కూడా సునంద పుష్కర్ మృతికి కారణాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ కేసులో వివిధ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల్లో వైరుద్ధ్యాలున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments