Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్తను 8 ముక్కలుగా నరికి?

కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా హతమార్చిన ఓ భార్యకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. పూజ (30), బల్జీత్ సింగ్‌లు భార్యాభర్తలు. అయితే బల్జీత్ కనిపించడం లేదంటూ

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (17:07 IST)
కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా హతమార్చిన ఓ భార్యకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. పూజ (30), బల్జీత్ సింగ్‌లు భార్యాభర్తలు. అయితే బల్జీత్ కనిపించడం లేదంటూ 2016 ఏప్రిల్ 26వ తేదీన అతని సోదరుడు కుల్జీత్ సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతేగాకుండా బల్జీత్ ఇంటి నుంచి ఏదో చెడు వాసన వస్తున్నట్లు సోదరుడు గుర్తించాడు. దీంతో పాటు బల్జీత్ అదృశ్యం వెనక పూజ హస్తం వుందని అతని బంధువులు అనుమానించారు. వీరి ఫిర్యాదుతో పూజ పేరును ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ఎక్కించారు. 
 
అనంతరం విచారణలో పూజ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సంతృప్తి చెందలేకపోయారు. 2016 ఏప్రిల్‌లో బల్జీత్ శరీరాన్ని 8 ముక్కలుగా నరికి ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో ఆ భాగాలను ఉంచారు. బల్జీత్ శరీర భాగాలను అతనింట వుంచడాన్ని చూసిన కుటుంబీకులు షాక్ తిన్నారు. ఆపై పూజ వద్ద జరిపిన విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
 
తన పొరుగింటిలో నివసిస్తున్న ఓ వ్యక్తితో పూజకు లైంగిక సంబంధం వుందని ఇద్దరం కలిసి భర్తను ఎనిమిది ముక్కలుగా నరికి చంపేసామని అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇరువైపు వాదనలు విన్న హర్యానాలోని జజ్జర్ కోర్టు పూజకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం