Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుంది.. పెళ్లి కొడుకును చూసేందుకు వచ్చి ఆస్పత్రిపాలయ్యారు..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (08:41 IST)
'వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టయింది' ఆ గ్రామ ప్రజల తంతు. పెళ్లి కొడుకుని చూసేందుకు వచ్చిన గ్రామ ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లాలో గల ఖట్ ఖట్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఖట్ ఖట్ గ్రామానికి చెందిన మనీషా అనే యువతికి రోహతక్‌కు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి ఆచారం ప్రకారం వధువు ఇంటికి వరుడు వచ్చాడు. ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. వధువు ఇంటికి వరుడు భారీ ఊరేగింపుతో వచ్చాడు. వరుడికి గ్రామపెద్దలు జయమాలా క్రతువు నిర్వహిస్తుండగా, గ్రామస్థులంతా వరుడుని చూసేందుకు ఎగబడ్డారు. 
 
ఈ క్రమంలో అనేక మంది ఇటి బాల్కనీలోకి ఎక్కారు. అనేక మంది ఒక్కసారిగా ఎక్కడంతో బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బాల్కనీ విరిగి దానికింద నిల్చొనివున్నవారిపై పడింది. దీంతో పురుషులు, మహిళలతో పాటు మొత్తం 16మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అలాగే, పెళ్లి ఫోటోలు తీసేందుకు వచ్చిన ఫోటోగ్రాఫర్లు సైతం గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments