మా నాన్న ఏడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు : యువతి వాంగ్మూలం

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (07:17 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నేశాడు. మాయమాటలు చెప్పి కన్నబిడ్డను లోబరుచుకున్నాడు. తర్వాత ఆమె శీలంపై కాటేశాడు. ఈ తంతు ఏడేళ్లుగా కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో యువతి పలుమార్లు గర్భందాల్చింది. అయినప్పటికీ ఆ కామాంధుడు వదిలిపెట్టలేదు. నాటు మందులు మింగించి అబార్షన్ చేస్తూ, మళ్లీ తన కామవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. చివరకు తన చెల్లిపై కూడా కన్నేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కన్నతండ్రి రూపంలో ఉన్న ఓ మృగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
హర్యానా రాష్ట్రంలోని హిసార్ పట్టణంలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఈ పట్టణానికి చెందిన ఓ తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు 17 యేళ్లు, చిన్న కుమార్తెకు 11 యేళ్లు. అయితే, పెద్ద కుమార్తెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అలా గత ఏడేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. పైగా, మానసికంగా, శారిరకంగా హింసించసాగాడు. ఈ క్రమంలో యువతి పలుమార్లు గర్భం రావడంతో దానిని తండ్రి బలవంతంగా తీయించాడు. 
 
ఈ క్రమంలో ఆ కామాంధుడి కన్ను చిన్న కుమార్తెపై పడింది. ఆమెను కూడా లైంగికంగా వధించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్ద కుమార్తె పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, కన్నబిడ్డలను లైంగికంగా వేధించింది నిజమేనని నిందితుడు అంగీకరించాడు. 
 
దీనిపై పెద్ద కుమార్తె మాట్లాడుతూ, గత ఏడేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు వాపోయింది. ఈ దారుణాన్ని ప్రతిఘటించినప్పుడు తనను చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం