హర్యానాలో కొనసాగుతున్న పోలీస్ అధికారుల ఆత్మహత్యలు... పూరన్ కుమార్‌పై సంచలన ఆరోపణలు

ఠాగూర్
మంగళవారం, 14 అక్టోబరు 2025 (17:06 IST)
హర్యానా రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఇటీవల కులవివక్ష, పోలీస్ ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీని బదిలీ చేయగా, డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను సెలవుపై హర్యానా ప్రభుత్వం పంపించింది. పైగా, పూరన్ కుమార్ ఆత్మహత్య పై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా మరో పోలీస్ ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రెండో అధికారి చనిపోయే ముందు రికార్డు చేసిన వీడియోలో ఏడీజీపీ పూరన్ కుమార్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడం ఇపుడు కలకలం రేపుతోంది. రోహ్‌తక్‌లో ఈ పోలీస్ ఉన్నతాధికారి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. 
 
అయితే, ఆయన ఆత్మహత్యకు ముందు ఒక వీడియోను రికార్డు చేశారు. ఆ వీడియోలో ఇటీవల మరణించిన ఏడీజీపీ పూరన్ కుమార్‌ ఒక అవినీతిపరుడని, ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని ఆరోపణలు పూరన్ కుమార్‌కు సంబంధించినవేనని ధృవీకరించారు. దీంతో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న అధికారిగా భావిస్తున్న పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments