Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్తను తగలేసి వాయు కాలుష్యం పెంచుతున్నాడు.. తండ్రిపై కుమార్తె ఫిర్యాదు.. ఫైన్

సాధారణంగా ఎవరైనా ఒక తప్పు చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు ధైర్యం కావాలి. అదే తమ కుటుంబ సభ్యులే చేస్తుంటే మరిత ధైర్యంతో పాటు.. తెగింపూ ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఓ అమ్మాయి.. ఏకంగా కన్నతండ్రిపైనే ఫిర

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (16:21 IST)
సాధారణంగా ఎవరైనా ఒక తప్పు చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు ధైర్యం కావాలి. అదే తమ కుటుంబ సభ్యులే చేస్తుంటే మరిత ధైర్యంతో పాటు.. తెగింపూ ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఓ అమ్మాయి.. ఏకంగా కన్నతండ్రిపైనే ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హర్యానాలోని జింద్‌ జిల్లాకు చెందిన ‘సోనాలి షోకండ్‌’ను హర్యానా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు 11 వేల రూపాయల రివార్డుతో సత్కరించింది. ఈ అవార్డు వచ్చినందుకు సోనాలి కుటుంబం, తోటి గ్రామస్తులు మెచ్చుకోకపోగా ఈసడించుకున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. పంట నూర్పిడి తర్వాత మిగిలిపోయిన చెత్తనంతా తగలబెట్టటం సోనాలి తండ్రికి అలవాటు. 
 
అది అతను ప్రతి ఏటా చేసే పనే. అయితే తగలబెట్టటం వల్ల రేగే పొగతో వాయు కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని తెలుసుకున్న సోనాలి తండ్రిని వారించింది. వినకపోతే ఏకంగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకే ఫిర్యాదు చేసింది. దాంతో వాళ్లు సోనాలి తండ్రికి 2,500 ఫైన్‌ వేశారు. కన్న కూతురే తన మీద ఫిర్యాదు చేయటంతో నొచ్చుకున్న సోనాలి తండ్రి ఆమెతో మాట్లాడటం మానేశాడు. కుటుంబమంతా ఆమెను ఆడిపోసుకున్నారు. అయినప్పటికీ ఆ యువతి మాత్రం ధైర్యంతో ముందుకు సాగిపోతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ - మహేశ్‌ల వల్ల రూ.100 కోట్లు నష్టపోయా - నిర్మాత సింగమనల :: కౌంటరిచ్చిన బండ్ల (Video)

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments