Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం.. పురుగుల మందు సేవించి చనిపోయాలా చేశారు..

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (08:41 IST)
హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో దారుణం జరిగింది. అక్కా చెల్లెళ్ళపై నలుగురు వలస కార్మికులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాళ్లే స్వయంగా బలవన్మరణానికి పాల్పడేలా ఒత్తిడి చేశారు. పురుగుల మందు తాగి చనిపోయేలా ఒత్తిడి చేశారు. ఆ తర్వాత పాముకాటుతో చనిపోయారని చెప్పాలని, లేదంటే హత్యచేస్తామని వాళ్ల తల్లిని కూడా బెదిరించారు. ఆఖరికి పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో సోనిపట్‌లో ఉంటున్నది. భర్త లేకపోవడంతో కూలినాలి చేసుకుంటూ తన 14, 16 ఏండ్ల కూతుళ్లను పోషించుకుంటున్నది. వారుంటున్న ఇంటిపక్కనే నలుగురు కుర్రాళ్లు ఉంటున్నారు. 
 
వారు వలస కార్మికులు. ఆ నలుగురు యువకుల కన్ను ఆ ఇద్దరు యువతులపై పడింది. ఈనెల 5, 6 తేదీల్లో ఇద్దరు అమ్మాయిలపై లైంగికదాడి చేశారు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోవాలని వారిపై ఒత్తిడిచేశారు. పాము కాటేసిందని చెప్పాలని వారి తల్లికి చెప్పారు. లేదంటే ఆమెను చంపుతామని బెదిరించారు.
 
అయితే.. ఆత్మహత్యకు పాల్పడిన అక్కాచెల్లళ్లను స్థానికులు ఢిల్లీలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే ఒకరు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. మరొక అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయింది. పాము కాటేసిందని వారి తల్లి వైద్యులకు చెప్పింది. 
 
కానీ, పోస్ట్ మార్టం రిపోర్టులో వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తేలింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. తల్లిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments