Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై నేరాలకు అడ్డాగా మారిన ఢిల్లీ.. మహిళను వెంబడించిన ఆటో డ్రైవర్.. కత్తితో పొడిచి?

ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతిని నడిరోడ్డుపైనే ఓ యువకుడు పలుమార్లు కత్తితో పొడిచిన ఘటన మరవక ముందే అలాంటి ఘటన పునరావృతమైంది.

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (19:17 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ లాంటి ఘటన జరిగినా.. మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు ఓవైపు వరకట్నం, లైంగిక వేధింపులు మరోవైపు.. గృహహింస, ప్రేమోన్మాదం ఇంకోవైపు.. ఇలా.. మహిళలపై నేరాలకు ఢిల్లీ అడ్డాగా మారిపోయింది. తాజాగా ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతిని నడిరోడ్డుపైనే ఓ యువకుడు పలుమార్లు కత్తితో పొడిచిన ఘటన మరవక ముందే అలాంటి ఘటన పునరావృతమైంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఎంజీ రోడ్డు స్టేషన్ వద్ద రోడ్డుపై నడుస్తున్న పింకీ దేవి (34) అనే మహిళను గత కొంత కాలంగా వేధిస్తున్న ఆటోడ్రైవర్ జితేందర్‌ ఆమెను వెంబడించడం మొదలెట్టాడు. అతని వేధింపులపై గతంలో భర్త మాన్ సింగ్‌కు గతంలో చెప్పేసిన పింకీ దేవి.. అతను వెంబడిస్తున్న సంగతిని ఫోను ద్వారా చెప్పింది. భర్తతో మాట్లాడుతుండగానే ఆమెను సమీపించిన జితేందర్ ఆమెను పలుసార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు.
 
సమాచారం అందుకున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆటో డ్రైవర్‌చే దాడికి గురైన పింకీ దేవి ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేుసకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం