జీ-7 నేతలకు ప్రధాని మోదీ కాశ్మీర్‌కు చెందిన కళాఖండాలను బహుమతులుగా అందజేశారు. కాశ్మీరీ కార్పెట్, రామ్ దర్బార్, జర్దోజీ బాక్స్ ఇంకా మరెన్నో కానుకలను బహూకరించారు.
ఇటీవల జర్మనీలో జరిగిన జి7 సదస్సుకు హాజరైన ఇతర దేశాధినేతలకు భారత దేశం గొప్ప కళలను ప్రదర్శిస్తూ వివిధ కానుకలను బహూకరించారు మోదీ.
ఇందులో మొరాదాబాద్ నుంచి మెటల్ మారోడి చెక్కిన మట్కాను జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌కు ప్రధాని మోదీ బహూకరించారు.
ఈ నికెల్ పూత పూసిన, చేతితో చెక్కిన ఇత్తడి పాత్ర మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఒక కళాఖండం, దీనిని భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని పీటల్ నగరి లేదా "ఇత్తడి నగరం" అని కూడా పిలుస్తారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ నుండి గులాబి మీనాకారి కఫ్ లింక్, బ్రూచ్ సెట్‌ను అందుకున్నారు. బులంద్ షహర్ ప్లాటినం-పెయింటెడ్, హ్యాండ్ పెయింటెడ్ టీ సెట్‌ను యుకె ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఇచ్చారు.
Modi Gifts
ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రధాని మోదీ చేతుల మీదుగా పట్టు తివాచీలు అందాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రధాని మోదీ నుంచి బ్లాక్ పాటరీ వస్తువులను అందుకున్నారు.
ఇంకా ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, సెనెగల్, అర్జెంటీనా దేశాలకు చెందిన నేతలకు కూడా ప్రధాని మోదీ బహుమతులు ఇచ్చారు.