Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగరాజును కంటిచూపుతోనే తరిమికొట్టిన అక్కాచెల్లెళ్లు.. ఎక్కడో తెలుసా?

ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సింహాన్నే కంటిచూపుతో పారిపోయేలా చేశారు. ఆడపిల్లలైనా.. సింహాన్ని చూసి జడుసుకోక ధైర్యంగా ఎదురు తిరిగారు. అందుకని కత్తులుకటార్లతో దాడికి దిగలేదు. చూపుతోనే మృగరాజును తరిమికొట్టారు

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:19 IST)
ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సింహాన్నే కంటిచూపుతో పారిపోయేలా చేశారు. ఆడపిల్లలైనా.. సింహాన్ని చూసి జడుసుకోక ధైర్యంగా ఎదురు తిరిగారు. అందుకని కత్తులుకటార్లతో దాడికి దిగలేదు. చూపుతోనే మృగరాజును తరిమికొట్టారు. ఎలాగంటే..? సంతోక్ (19), మయ్యా (18) ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. గుజరాత్‌లోని గిర్ అభయారణ్యం సమీపంలోని కుగ్రామం వీరి నివాసం. తండ్రికి అనారోగ్యం కావడంతో పశువులను మేపేందుకు కొన్ని రోజులుగా వీరు అడవిలోకి వెళ్తున్నారు. 
 
అక్టోబర్ 9న ఎప్పటిలాగే.. పశువులను మేపడానికి వెళ్లినప్పుడు అక్కడికి ఒక సింహం వచ్చింది. ఆసియాటిక్ సింహాలు క్రూరమైనవి. సింహాన్ని చూసిన వెంటనే ఆ ఇద్దరు అమ్మాయిలు పారిపోలేదు. తమతో పాటు పశువుల ప్రాణాలు కూడా కాపాడాలని నిశ్చయించుకున్నారు. చేతిలో మామూలు కర్రలతో ధైర్యంగా పశువుల ముందుకు వెళ్లి.. సింహం వైపే చూస్తూ నిలబడిపోయారు. 
 
సింహాన్ని రెచ్చగొట్టకుండా.. దాని కంటే తీవ్రమైన చూపులతో భయపెట్టారు. వారిని చూసి సింహం ఏమనుకుందో ఏమో కానీ.. వెనక్కు తిరిగి వెళ్లిపోయింది. బాలికల ధైర్యం చూసిన గ్రామస్తులు, అటవీ అధికారులు అక్కాచెల్లెళ్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సింహానికి వెన్నుచూపితేనే దాడి చేస్తాయని.. వాటికి ముందు ధైర్యంగా నిలబడితే పారిపోతాయని సంతోక్ చెప్పడం.. అందరినీ షాక్‌కు గురిచేసింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments