Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం క్యూలైన్లలో సాధారణ ప్రజలు.. పని ఒత్తిడిలో బ్యాంకు సిబ్బంది ప్రాణాలు పోతున్నాయ్

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అనేక మందికి ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా... ఏటీఎం‌లలో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు క్యూలైన్లలో నిలబడలేక

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (15:29 IST)
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అనేక మందికి ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా... ఏటీఎం‌లలో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు క్యూలైన్లలో నిలబడలేక సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య ఇప్పటికే పదుల సంఖ్యలో ఉంది. 
 
తాజాగా బ్యాంకులో పని ఒత్తిడిని తట్టుకోలేక క్యాషియర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒకటి గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. పెద్దనోట్ల రద్దు నేప‌థ్యంలో దేశంలోని అన్ని బ్యాంకుల ముందు ఖాతాదారులు భారీ సంఖ్య‌లో చేరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌ని పెరిగి, కొంద‌రు బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. 
 
ఈ నేప‌థ్యంలోనే గుజరాత్‌లోని థారడ్‌లో భారత స్టేట్ బ్యాంకు శాఖ‌లో క్యాషియ‌ర్‌గా ప‌నిచేస్తోన్న‌ ప్రేమ్‌ శంకర్‌ ప్రజాపతి అనే వ్యక్తి శనివారం సాయంత్రం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు. ప‌నిలో ఒత్తిడి వ‌ల్లే త‌న భ‌ర్త ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని ప్రేమ్ శంకర్ భార్య తెలిపింది. 
 
కొన్ని రోజుల నుంచి తన భర్త ఇంట్లో ఎవ‌రితోనూ మట్లాడ‌కుండా త‌న‌లో తానే బాధ‌ప‌డిపోతున్నాడ‌ని చెప్పింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ శంక‌ర్‌ది స్వ‌స్థ‌లం రాజస్థాన్‌‌లోని బార్మర్‌ అనే ప్రాంతం. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments