Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తింటున్నాడు.. వేధింపులకు గురిచేస్తున్నాడు.. విడాకులిచ్చేయండి..

ప్రేమించిన వ్యక్తి కోసం ఆ మహిళ తల్లిదండ్రులకు దూరమైంది. మతాలు వేరైనప్పటికీ.. అతడినే పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లికి ముందు ప్రేమ మైకంలో చికెన్‌ కాదు.. మాంసాహారమే ముట్టనని మాటిచ్చిన ప్రేమికుడు.. పెళ్లై

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (18:11 IST)
ప్రేమించిన వ్యక్తి కోసం ఆ మహిళ తల్లిదండ్రులకు దూరమైంది. మతాలు వేరైనప్పటికీ.. అతడినే పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లికి ముందు ప్రేమ మైకంలో చికెన్‌ కాదు.. మాంసాహారమే ముట్టనని మాటిచ్చిన ప్రేమికుడు.. పెళ్లై ఐదేళ్లు గడిచినా చికెన్‌ను ఏమాత్రం వదిలిపెట్టలేదు. దీంతో ఇక చేసేది లేక ఆ మహిళ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల‌ క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉండే జైన మతానికి చెందిన రీమా అనే యువ‌తి బీహార్‌కు చెందిన కరణ్‌ను ప్రేమించింది. ఆ యువ‌తి డిగ్రీ చ‌దువుతుండ‌గా కరణ్ వృత్తి రీత్యా కంప్యూటర్ ఆప‌రేట‌ర్‌గా పనిచేసేవాడు. 
 
వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటే.. మాంసాహారం ముట్టకూడదని ప్రియుడికి షరతు పెట్టింది. అతను కూడా ఇందుకు ఒప్పుకున్నాడు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్లి చికెన్ తిని వచ్చేవాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. 
 
కానీ తమ దాంపత్య జీవితానికి గుర్తుగా కవల పిల్లలు పుట్టినా.. ఆ మహిళ మాత్రం తన భర్త మాంసాహారం ఇష్టానికి తినేస్తున్నాడని.. ఇంకా వేధింపులకు కూడా గురిచేస్తున్నాడని భరించలేకపోతున్నానని కోర్టును ఆశ్రయించింది. ఇంకా అతని నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును కోరింది. ఇందుకు అంగీకారం కూడా లభించింది. ఫలితంగా ఈ జంట విడాకుల ద్వారా తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments