Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో తీవ్రరూపం దాల్చిన కుల చిచ్చు... హోం మంత్రి ఇంటికి నిప్పు..

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (15:33 IST)
గుజరాత్‌లో చెలరేగిన కుల చిచ్చు తీవ్ర రూపందాల్చింది. పటేల్ కులస్థులను ఓబీసీ జాబితాలో చేర్చడంతో పాటు రిజర్వేషన్లు కల్పించాలంటూ రెండు రోజులుగా గుజరాత్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పటేళ్ళ ఆందోళనల కారణంగా ఇప్పటికి ఎనిమిది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు గురువారం ఆ రాష్ట్ర హోంమంత్రి రజని పటేల్ ఇంటికి  నిప్పుపెట్టారు. 
 
మెహ్‌సనా ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన వెంటనే ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో  మంటల కారణంగా హోంమంత్రి ఇంటికి పెద్దగా నష్టం ఏమీ జరగలేదన్నారు. పటేళ్ళ ఆందోళన ఉద్రిక్త రూపం సంతరించుకున్న క్రమంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతా దళాలు, పోలీసులు, సైన్యం ప్రయత్నిస్తున్నాయి. 
 
మరో వైపు శాంతియుతంగా ఉండాలని, ఆందోళనలు విరమించాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments