Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో కాషాయం - హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం హవా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (10:31 IST)
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం మొదలైంది. ఈ ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల మధ్య దోబూచులాడాయి. 
 
చివరకు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. ఆ పార్టీ సరిగ్గా 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 29, కాంగ్రెస్ 35, ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంటే, హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఒకసారి అధికారంలో ఉన్న పార్టీని మళ్లీ గెలిపించిన దాఖలాలు లేవు. ఈ ఆనవాయితీని మరోమారు పునరావృతం చేశారు. దీంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. 
 
మరోవైపు, గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుంది. ఆ పార్టీ ఏకంగా 155 సీట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. గతంతో పోల్చితే ఈ దఫా 60కు పైగా సీట్లను కోల్పోయింది. ప్రస్తుతం బీజేపీ 155 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల, ఆప్ 6, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments