Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకు ఎక్కేందుకు నిరాకరించిన దళిత యువతిని చంపేశారు... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (11:15 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. బైకు ఎక్కేందుకు నిరాకరించిన ఓ దళిత యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా బావ్లా పట్టణంలో మరో రెండు వారాల్లో బాధిత యువతి మిట్టల్ జాదవ్ వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన స్నేహితులైన శ్రవణ్, ధన్‌రాజ్‌లతో కలిసి వచ్చిన కేతన్ వాఘేలా అనే యువకుడు యువతిని తన బైక్‌పై ఎక్కాల్సిందిగా కోరాడు. 
 
మిట్టల్ అందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేతన్ అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం కత్తి పట్టుకునే అక్కడి నుంచి పరుగులు తీశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతి కాసేపటికే ప్రాణాలు విడిచింది. 
 
యువతి తండ్రి రమేశ్ జాదవ్ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments