Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాశ్రమంలో గాంధీజీ మనుమడు కానూభాయ్ గాంధీ... దగ్గరకు చేర్చని బంధువులు...

Webdunia
ఆదివారం, 15 మే 2016 (09:28 IST)
తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి భరతమాతను బంధ విముక్తి చేసి.. దేశ ప్రజలకు స్వేచ్ఛను కల్పించిన జాతిపిత మహాత్మాగాంధీ. ఆయన కుటుంబానికి చెందిన బంధువులు ఎవరైనా వృద్ధాశ్రమాల్లో అరకొర సౌకర్యాలతో జీవిస్తున్నారంటే నమ్ముతారా? కానీ, ఇపుడు నమ్మితీరాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. 
 
పేరు.. కానూభాయ్ గాంధీ. స్వయానా జాతిపిత మహాత్మా గాంధీకి మనుమడు. చిన్నప్పుడు గాంధీ తాతయ్య ఒడిలోనే పెరిగాడు. కానీ ఇప్పుడు 87వ యేట ఆదుకునేవారు లేక ఢిల్లీలోని వృద్ధాశ్రమంలో రోజులు వెళ్లదీస్తున్నారు. అదీ అరకొర సౌకర్యాలతో తన బతుకుబండిని లాగిస్తేస్తున్నారు. 
 
గాంధీజీ మూడో కుమారుడైన రాందాస్ గాంధీకి ఈయన కొడుకు. నిరాశ్రయులకు నీడనిచ్చే వృద్ధాశ్రమంలో తన 85 సంవత్సరాల సతీమణి డాక్టర్ శివలక్ష్మితో ఉంటున్నారు. పిల్లలు లేని ఈ దంపతులు తమ జీవితంలో అధికభాగం అమెరికాలోనే గడిపారు. తమవారితో కలిసి చివరిరోజులు గడుపుదామని 2014లో స్వదేశానికి వచ్చారు. 
 
కానీ, బంధువులు వీరిని అక్కున చేర్చుకోలేదు. దీంతో విరక్తి చెందారు. ఒక ఆశ్రమం నుంచి మరో అశ్రమానికి మారుతూ చివరికి ఈ నెల 8న ఢిల్లీలోని గురువిశ్రాం వృద్ధాశ్రమం చేరుకున్నారు. అరకొర సౌకర్యాల మధ్య గడుపుతున్నారు. దీనిపై ఆశ్రమ యజమాని డాక్టర్ జీపీ భగత్ స్పందిస్తూ.. సబర్మతి ఆశ్రమం నుంచి కానూబాయ్ దంపతులను వెళ్లగొట్టినట్టు తెలుస్తున్నదని తెలుస్తోందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments