Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ నిందితులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారు..? ఎందుకనుమతించారు..? ప్రభుత్వం సీరియస్

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (05:44 IST)
నిర్భయపై అత్యాచారానికి పాల్పడి జైలులో ఉన్న నిందితులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారు? అసలు ఈ ఇంటర్వ్యూకు ఎలా అనుమతి లభించింది.? వారు చేసిన వ్యాఖ్యలు దేశంలో ఏం సందేశాన్ని ఇస్తాయి..? వెంటనే ప్రసారాలను నిలిపేయండి.. ఈ ఉదంతంపై పూర్తి సమాచారాన్ని ఇవ్వండి.. అంటూ కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. జైళ్ల శాఖను సంజాయిషీ కోరింది. వివరాలిలా ఉన్నాయి. 
 
నిర్భయ’పై పాశవిక అత్యాచారం కేసులో ఉరిశిక్షపడిన దోషి ముఖేశ్ సింగ్‌ను బ్రిటన్ డాక్యుమెంటరీ నిర్మాత ఒకరు ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ ఎన్డీటీవీలో ప్రసారం కావాల్సి ఉంది. అందులోని ఓ చిన్న బిట్టు ఒకటి లీక్ అయ్యింది. అందులో ముఖేశ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అమ్మాయిలు ఎలా బయటకు వస్తారు. అమ్మాయిలు రాత్రి బయటకు వచ్చారంటే అంత మంచి వాళ్ళేమి కాదు అనే మాటతో పాటు ఆమె తిరబడకుండా ఉంటే రేప్ చేసి వదిలేసేవాళ్లమని చెప్పడం అగ్గిక ఆజ్యం పోసినట్లైంది. 
 
సంచలనం కోసం కాకుండా, మహిళలపట్ల పురుషుల దృక్పథాన్ని తెలుసుకోవడానికే ముఖేశ్‌ను ఇంటర్వ్యూ చేశానని ‘భారత్ కుమార్తె’ పేరుతో డాక్యుమెంటరీ తీసిన నిర్మాత లెస్లీ ఉద్విన్ చెప్పారు. బీబీసీ కోసం ముఖేశ్‌తో మాట్లాడేందుకు 2013 మే నెలలో అప్పటి తీహార్ జైలు డెరైక్టర్ విమలా మెహ్రా నుంచి అనుమతి తీసుకున్నానని, హోం శాఖ అందుకు ఒప్పుకుందని తెలిపారు. 
 
ఇదిలా ఉండగా, ముఖేశ్ మాటలు సిగ్గు చేటని, అతన్ని ఉరి తీయాలని నిర్భయ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దుమారం చెలరేగింది.  ఇంటర్వ్యూపై రాజ్‌నాథ్ సింగ్ తీహార్ జైలు డీజీ అలోక్ కుమార్‌కు ఫోన్ చేసి, వెంటనే వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది ప్రసారం కాకుండా, ప్రచరుణ కాకుండా పోలీసులు నిషేధాజ్ఞలు పొందారు. డాక్యుమెంటరీని ప్రసారం చేయొద్దని సమాచార, ప్రసార శాఖ టీవీ చానళ్లకు సూచించింది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments