Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపా జయకుమార్‌ను బెదిరిస్తున్న గూండాలు.. ఓపీఎస్‌కు మరో ఎమ్మెల్యే మద్దతు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు రాజకీయాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమెకు ఆదిలోనే కష్టాలు తప్పలేదు.

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (14:19 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు రాజకీయాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమెకు ఆదిలోనే కష్టాలు తప్పలేదు. ఉప ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి ఆమెను పోటీ చేయకుండా విరమింపజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఓపీఎస్ దూరంగా ఉండాలనుకున్న దీప.. ఆర్కే నగర్‌లో ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. 
 
అయితే ఏప్రిల్ 12న ఆర్కేనగర్ నియోజకవర్గ బైపోల్‌లో పోటీ చేయకూడదంటూ ఆమెకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ సీటు నుంచి పోటీ చేయాలని తాను స్టేట్‌మెంట్ చేసినప్పటి నుంచి రకారకాలుగా వేధిస్తున్నారని దీప ఆరోపించారు. కనీసం తాను ఇంట్లో కూడా ఉండలేకపోతున్నానని, పలువురు గూండాలు అక్కడికి వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు వారు ఎవరికి చెందినవారో తనకు తెలియట్లేదని దీప ఆరోపణలు గుప్పించారు. 
 
ఇదిలావుంటే.. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్‌ కుమార్‌ చేరారు. దీంతో పన్నీర్‌సెల్వం వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరుకుంది. కోయంబత్తూర్‌ నార్త్‌ నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన అరుణ్‌ కుమార్‌ సోమవారం మాజీ సీఎం ఓపీఎస్ నివాసానికి చేరుకుని ఆయనకు మద్దతు ప్రకటించారు. 
 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వికె శశికళకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో కలిసి కూవత్తూర్‌ రిసార్ట్స్‌లో ఉన్న అరుణ్‌కుమార్‌ అక్కడి నుంచి నిశ్శబ్దంగా బైటకు వెళ్లిపోయి తన నియోజకవర్గమైన కోయంబత్తూరుకు చేరారు. గత నెల జరిగిన పళనిస్వామి విశ్వాస తీర్మానంలో అరుణ్ పాల్గొనకపోవడం గమనార్హం. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments