Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌పై గుడ్‌న్యూస్

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (05:44 IST)
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు రకరకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభించారు.. ఇక, హైదరాబాద్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న భారత్ బయోటెక్ కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ తయారీలో ముందుంది.

ఆ సంస్థ రూపొందిస్తున్న ‘కొవాగ్జిన్‌’ టీకాపై కీలక ప్రకటన చేసింది.. ఇది భారత్‌కు గుడ్‌న్యూస్‌గా చెప్పుకోవాలి.. ఎందుకుంటే.. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఎలాంటి ప్రతికూల ప్రభావాల్ని చూపడం లేదని వెల్లడించింది భారత్ బయోటెక్.. తొలి దశ ట్రయల్స్‌కు సంబంధించి ఫలితాలను ప్రకటించింది ఆ సంస్థ.

ఈ వ్యాక్సిన్ వాడినవారిలో వచ్చిన సైడ్‌ ఎఫెక్ట్స్‌.. ఎలాంటి మందులు అవసరం లేకుండానే తగ్గిపోయినట్టు పేర్కొంది. ఈ ఫేజ్‌ 1 ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాల ప్రకారం.. టీకా రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు.. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌చూపలేదు అంటోంది భారత్‌ బయోటెక్‌.

మరోవైపు ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం గతనెలలో నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.. కానీ, దీనికి మాత్రం అనుమతి రాలేదు. 

ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే రెండు దశల్లో ట్రయల్స్ పూర్తిచేసుకున్న కోవాగ్జిన్.. ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments