Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ లో వీసా గడువు ముగిసిన భారతీయులకు శుభవార్త!

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (07:58 IST)
వీసా గడువు ముగిసి యూఏఈలోనే ఉండిపోయిన వారికి దుబాయ్ లోని భారత కాన్సులేట్ శుభవార్త వినిపించింది.. సరైన డాక్యుమెంట్లు లేకుండా యూఏఈలోనే ఉండిపోయిన వారిని ఇండియా తరలించేందుకు రెండు నెలల స్పెషల్ డ్రైవ్ ను చేపట్టినట్లు భారత్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి ప్రకటించారు.

కరోనా ప్రభావంతో యూఏఈలోని చాలామంది ప్రవాసీయులు ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే . ఇంకొంత మంది ప్రవాసీయులకు వారి యాజమాన్యాలు జీతం లేని బలవంతపు సెలవులు ఇచ్చాయి. దీంతో వీసా రెన్యూవల్ చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

ఇంటికి తిరిగి వెళ్లామనుకుంటే..వేల మంది ప్రవాసీయుల పాస్ పోర్టులు వారి యాజమానులు , స్పాన్సర్ల దగ్గరే ఉండిపోయాయి . దీంతో వందే భారత్ మిషన్ ఫ్లైట్స్ లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని డాక్టర్ అమన్ పురి వివరించారు.

సరైన డాక్యుమెంట్లు లేకపోవటంతో వేల మంది ఎమర్జెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు . అలాంటి వారికోసమే కాన్సులేట్ కార్యాలయం ప్రత్యేక పథకం ద్వారా సరైన డాక్యుమెంట్లు లేకున్నా ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసి వారిని ఇండియా పంపించేలా చొరవ తీసుకుంటోందని తెలిపారు.

మరోవైపు మార్చి 1 తో వీసా గడువు ముగిసిన వారు నవంబర్ 17 లోగా స్వదేశాలకు వెళ్లిపోతే ఎలాంటి జరిమానా చెల్లించనవరం లేదని , ఆ తర్వాత తప్పనిసరిగా ఫైన్ వసూలు చేస్తామని ప్రకటించింది.

దీంతో యూఏఈ ప్రకటించిన క్షమాభిక్ష గడువులోగా యూపఈలోని ప్రవాస భారతీయులను ఇండియా పంపించేందుకు దుబాయ్ లోని భారత కాన్సులేట్ ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.

తమ సేవలు దుబాయ్ కి మాత్రమే పరిమితం చేయకుండా యూపఈలోని ఫుజైరా , రస్ ఆల్ ఖైమా వంటి ఇతర ఎమిరేట్లోని ప్రవాసీయులకు కూడా సాయం చేస్తున్నట్లు అమన్ పురి తెలిపారు. ఇదిలాఉంటే..వందే భారత్ మిషన్ చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 3 , 70,000 మంది ఇండియాకు వెళ్లినట్లు పేర్కొన్నారు.

మరో 6 లక్షల మంది తిరుగు ప్రయాణానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. యితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడిప్పుడే వ్యాపార సంస్థలు , హోటల్స్ తిరిగి కార్యాకలాపాలు ప్రారంభించటంతో కొందరు ప్రవాసీయులు యూఏఈలోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇండియా వెళ్లేందుకు ఇప్పటికే ఫ్లైట్ బుకింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నా ... తాజా పరిణామాలతో వారు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు అమన్ పురి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం