Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు మరుగుదొడ్డి చోరీ... టాయిలెట్ ధర రూ.8.8 కోట్లు

Webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (11:32 IST)
బంగారు మరుగుదొడ్డి చోరీకి గురైంది. లండన్‌లోని బ్లనియమ్ ప్రాసాదంలోని మ్యూజియంలో ఉన్న ఈ గోల్డ్ మరుగుదొడ్డి చోరీకి గురైంది. 18 కేరెట్ల బంగారంతో చేసిన ఈ టాయిలెట్ ధర రూ.8.8 కోట్లు. న్యూయార్క్‌లోని సోలోమన్ ఆర్ గుగెన్‌హైమ్ ప్రదర్శనశాల నుంచి రెండు రోజుల క్రితమే దీనిని లండన్ తీసుకొచ్చి ప్రదర్శనశాలలో ఉంచారు. 
 
నిజానికి వచ్చే నెల 27వరకు దీనిని ఇక్కడే ఉంచాలని మ్యూజియం నిర్వాహకులు భావించారు. కానీ వున్నట్టుండి దానిని దొంగలు ఎత్తుకుపోవడంతో కలకలం రేగింది. బంగారు టాయిలెట్ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న లండన్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 
దొంగతనానికి దుండగులు రెండు వాహనాలను వాడారని, లోతైన దర్యాప్తు నిర్వహించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. దొంగతనం నేపథ్యంలో అధికారులు శనివారం బ్లెన్హీవ్‌ ప్యాలెస్‌ను మూసివేశారు. పర్యాటకులను అనుమతించలేదు. కాగా, అమెరికాలోని న్యూయార్క్‌లో సాలమన్‌ గుగ్గెన్‌ హీవ్‌ మ్యూజియంలో ఇటీవలే ఈ టాయిలెట్‌ను ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments