Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చలేదని స్నేహితురాలి అసభ్య ఫోటో ఫేస్‌బుక్‌లో పోస్ట్.. యువతి ఆత్మహత్య

సోషల్ మీడియా. ప్రపంచ సమాచారాన్ని క్షణాల్లో తమ గుప్పెట్లో ఉంచుతున్న సామాజికమాధ్యం. అయితే, దీన్ని కొందరు కామాంధులు మరోలా ఉపయోగిస్తూ... పలువురి మరణాలకు కారణభూతులవుతున్నారు. తాజా, తన కోర్కె తీర్చలేదన్న అక

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (09:30 IST)
సోషల్ మీడియా. ప్రపంచ సమాచారాన్ని క్షణాల్లో తమ గుప్పెట్లో ఉంచుతున్న సామాజికమాధ్యం. అయితే, దీన్ని కొందరు కామాంధులు మరోలా ఉపయోగిస్తూ... పలువురి మరణాలకు కారణభూతులవుతున్నారు. తాజా, తన కోర్కె తీర్చలేదన్న అక్కసుతో ఓ యువతి అసభ్య ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడో యువకుడు. అది చూసిన ఆ యువతి అవమానం భరించలేకు ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు చెందిన 20 ఏళ్ళ యువకుడు, 17 ఏళ్ళ యువతి రెండేళ్ళ కిందట ప్రేమించుకున్నారు. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇటీవల విడిపోయారు. అయితే నాటి నుంచి ఆ యువకుడు ఆమెను మానసికంగా హింసిస్తూ బెదిరిస్తున్నాడు. ఈక్రమంలో తన కోర్కె తీర్చాలని ఆదివారం రాత్రి యువతిని బెదిరించాడు. 
 
దీనికి ఆ యువతి ససేమిరా అనండంతో అమె అశ్లీల ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇది గమనించిన ఆమె తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అవమానం తట్టుకోలేక ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సైబర్ క్రైం కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments