Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటికే యాభై సార్లు చెప్పా.. మోడీనే ప్రధాని : నితిన్ గడ్కరీ

Webdunia
మంగళవారం, 21 మే 2019 (10:16 IST)
ఈ నెల 23వ తేదీ తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజార్టీ వస్తుందని, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నితిన్ గడ్కరీ జోస్యం చెప్పారు.
 
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ నటించిన పీఎం నరేంద్ర మోడీ చిత్ర పోస్టర్‌ను ఆయన ముంబైలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే తుది ఫలితాలు కాదన్నరు. అయితే, బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే సంకేతాలను మాత్రం ఇచ్చాయని ఆయన గుర్తుచేశారు. 
 
ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ కాదని, ఎగ్జిట్ పోల్స్‌లో ఉన్నది తుది ఫలితాల్లో ప్రతిబింభిస్తుందన్నారు. ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా... నరేంద్ర మోడీ నాయకత్వంలో తాము ఎన్నికలకు వెళ్లామని ఇప్పటికే 20 నుంచి 50 సార్లు చెప్పానని గడ్కరీ అన్నారు. మోడీనే మరోసారి ప్రధాని అవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments