Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ భార్య మృతి!? ఆస్పత్రిలో త్రివిధ దళ చీఫ్?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (15:00 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని కాట్టేరి కొండ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన ఎంఐ17 వి5 రకం హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన హెలికాఫ్టర్‌లో త్రివిధ దళపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు సహా మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఈ ప్రమాదం జరిగిన హెలికాప్టర్‌‍లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితిపై మాత్రం స్పష్టత లేదు. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం బిపిన్ రావత్ తీవ్రంగా గాయపడటంతో ఆయన్ను కున్నూరు ఆర్మీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, వీటిపై ఆర్మీ వర్గాలు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే, ఆయన భార్య మాత్రం మృతి చెందారు. 
 
ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరుగగా, ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్ర రాజ్‌నాథ్ సింగ్ మంత్రివర్గానికి వివరించారు. అలాగే, ఆయన పార్లమెంట్‌లో కూడా ఓ ప్రకటన చేశాక ఢిల్లీ నుంచి బయలుదేరి నీలగిరి జిల్లా కున్నూరుకు చేరుకోనున్నారు. 
 
మరోవైపు, భారత త్రివిధ దళాధిపతిగా బిపిన్ రావత్ గత 2019 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన భారత ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. 2019లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా త్రివిధ ఆర్మీ చీఫ్ పదవిని సృష్టించింది. దీంతో ఆ బాధ్యతలు స్వీకరించిన తొలి అధికారి బిపిన్ రావత్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments