Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గర్ల్ ఫ్రెండ్ మాజీ లవర్‌ను కాల్చేశా.. దమ్ముంటే పట్టుకోండి... ఖాకీలకు సవాల్ (Video)

రాజస్థాన్ రాష్ట్ర పోలీసులకు ఓ యువకుడు నిత్యం సవాల్ విసురుతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మాజీ ప్రియుడిని కాల్చిచంపానని, దమ్ముంటే తనను అరెస్టు చేయండంటూ ఖాకీలకే సవాల్ విసురుతున్నాడు.

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (12:39 IST)
రాజస్థాన్ రాష్ట్ర పోలీసులకు ఓ యువకుడు నిత్యం సవాల్ విసురుతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మాజీ ప్రియుడిని కాల్చిచంపానని, దమ్ముంటే తనను అరెస్టు చేయండంటూ ఖాకీలకే సవాల్ విసురుతున్నాడు. పైగా, ఒక్కోరోజు ఒక్కోప్రాంతం నుంచి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాడు. ఆ యువకుడి చేష్టలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తన గర్ల్ ఫ్రెండ్ మాజీ స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపిన ఓ యువకుడు, ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారాడు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని నిత్యమూ ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో సవాల్ విసురుతున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, 
 
రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన దీపక్ మాలిక్‌కు ఇందుబాల అనే యువతి స్నేహితురాలు. ఆమె గతంలో హర్యానాకు చెందిన వినోద్ అనే యువకుడితో సన్నిహితంగా ఉండేది. అయితే, తన మాజీ ప్రియుడి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో అతన్ని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. 
 
ఆ ప్రకారంగానే ఇందుబాలతో కలసి వినోద్‌ను దీపక్ తుపాకితో కాల్చి చంపి పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు సవాళ్లు మొదలయ్యాయి. రోజూ ఫేస్‌బుక్‌లోకి వస్తూ, తుపాకులు పట్టుకుని ఫోజులిస్తూ, తనను పట్టుకోవాలని సవాల్ విసురుతున్నాడు. కాగా, ప్రస్తుతం ఇందుబాల మాత్రం పోలీసు కస్టడీలో ఉండగా, ప్రధాన నిందితుడు దీపక్‌ మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments