Webdunia - Bharat's app for daily news and videos

Install App

#GandhiJayanti నేతల నివాళులు... దేశ వ్యాప్తంగా గాంధీ పండుగ

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (10:40 IST)
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీలు ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్ వద్ద వారు పుష్పగుచ్చాలు వుంచి నివాళులు అర్పించారు. అలాగే, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. 
 
ముఖ్యంగా, ఈ గాంధీ జయంతి వేడుకలకు ప్రత్యేక ఉన్న విషయం తెల్సిందే. గాంధీ 150వ జయంతి వేడుకల పేరుతో వీటిని నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా, కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలో గాంధీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించారు. ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు బాపూజీకి నివాళులు అర్పించారు. అలాగే, ఏపీలో కూడా గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌లు నివాళులు అర్పించారు.
 
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు కూడా గాంధీకి నివాళి అర్పించారు. "శాంతి కాముకుడు, హరిత విప్లవకర్త, జై జవాన్ జై కిసాన్ అని నినదించి దేశాన్ని ముందుకు నడిపిన ధీరోదాత్తుడు, భారత మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments